పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రెచ్చిపోయారు. వారం రోజుల క్రితం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏఎస్సైని కాలితో తన్నిన విషయం మర్చిపోకముందే.. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఏకంగా ఒక ఎస్సైని, రైటర్‌ను తన కార్యాలయానికి పిలిపించి నిర్భంధించారు. పార్టీ కార్యాలయంలో కటిక నేలపై కూర్చోబెట్టి అవమానించారు. ‘నా మాట వినకుండా మా పార్టీ వారిపై కేసులు పెడతావా. నాకు సమాధానం చెప్పే వరకూ నిన్ను ఇక్కడి నుంచి వదిలేది లేదు’ అంటూ భీష్మించారు. పార్టీ కార్యకర్తలు పోలీసులను బండబూతులు తిట్టినట్టు సమాచారం. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..