టీచర్‌పై తెలుగుదేశం నేత దాడి | TDP leader attack on Teacher In YSR District | Sakshi
Sakshi News home page

Jul 12 2015 6:46 AM | Updated on Mar 22 2024 11:06 AM

ప్రభుత్వ అధికారులపై, ఉద్యోగులపై తెలుగుదేశం నేతల దాష్టీకాలు కొనసాగుతున్నాయి. మొన్న తహసీల్దార్ వనజాక్షి, చిత్తూరు జిల్లా చిన్నగొట్టిమల్లు మండల తహసీల్దార్ నారాయణమ్మ మీద దాడులకు పాల్పడ్డ తెలుగుదేశం నేతలు తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో రెచ్చిపోయారు. ఇక్కడ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి సమక్షంలో టీడీపీ నేత ఓ టీచర్ చెంప ఛెళ్లుమనిపించాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంటిమిట్టలో సోమశిల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించే కార్యక్రమానికి ప్రభు త్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ రమణ హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్ వెళ్లిపోయారు. మేడా మల్లికార్జునరెడ్డి కొద్దిసేపు ఆ ప్రాంతంలోనే ఉండి పనులను పరిశీలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement