మంత్రి కేటీఆర్ సీఎం కావాలనే ఆలోచనతోనే సచివాలయాన్ని కూల్చివేయాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని టీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు సీఎం కాలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఇప్పుడు హరీష్ సీఎం అవుతారేమోననే భయం కేసీఆర్ కు పట్టుకుందని.. అందుకోసమే వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చాలనుకుంటున్నారని తెలిపారు.