ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక నగరం ఆగ్రాకు సమీపంలోని ఫతేపూర్ సిక్రీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ యువ జంటపై ఐదుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.