పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు చేసిన ఫిర్యాదులను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో నవంబర్ 8వ తేదీ లోగా చెప్పాలని తెలంగాణ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయమై తమకు ఇంతవరకు నోటీసులు కూడా ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కానీ తాము ఇప్పటికే ఆ నోటీసులను పంపామని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం.. తెలంగాణ స్పీకర్ ఎంత గడువులోగా చర్యలు తీసుకుంటారో నవంబర్ 8వ తేదీలోగా స్పష్టం చేయాలని తెలిపింది.