సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని వినిపించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎంతమంది సంతృప్తిగా ఉన్నారో తనకు తెలియదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో ముచ్చటించిన ఆయన జాతీయగీతం, బీఫ్ నిషేధం సహా పలు అంశాలపై స్పందించారు. 'హలాల్ చేసినదైతే బీఫ్ తినడానికి నేను ఇష్టపడుతా. దీనితో ప్రభుత్వాలకు ఏం సంబంధం?' అని ఆయన ప్రశ్నించారు. ముస్లిం యువతలో అతివాద భావజాలం పెరిగిపోవడంపై స్పందిస్తూ అది ఆందోళనకరమని అన్నారు. రాడికలైజేషన్ ఏ మతంలో ఉన్నా అది ఆందోళనకరమేనని వ్యాఖ్యానించారు.