బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు హిట్ అండ్ రన్ కేసులో మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. గత రెండు నెలల క్రితం సల్మాన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఇటీవల దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు మంగళవారం సుప్రీం అంగీకారం తెలిపింది. సల్మాన్ కు హిట్ అండ్ రన్ కేసులో కింది కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను బాంబే హైకోర్టు సస్పెండ్ చేస్తూ.. సల్మాన్ కు బెయిల్ మంజూరు చేసింది.