భారత ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఫ్రాన్స్‌కు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ మద్దతు తెలిపింది. భారత్‌లో తయారు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లో తమ ఔట్‌సోర్సింగ్‌ను 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు తెలిపింది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తౌలోస్‌లోని ఎయిర్‌బస్ విమాన కర్మాగారాన్ని సందర్శించిన సందర్భంగా ఆ సంస్థ పై విధంగా స్పందించింది. సంస్థ సీఈఓ టామ్ ఎండర్స్ మోదీకి స్వాగతం పలికారు. కర్మాగారంలో ఎ380 ఎయిర్‌బస్‌ను తుదిగా రూపొందించే ప్రక్రియను మోదీ పరిశీలించారు. భారత్‌లో ప్రస్తుతం 4 ఎ380 విమానాలు ప్రతి రోజూ సేవలందిస్తున్నాయని ఈ సందర్భంగా టామ్ ఒక ప్రకటనలో తెలిపారు.