విజయనగరంలో బొత్స కళాశాలపై విద్యార్థులు దాడి | Students attacked on pcc chief botsa satyanarayana college at vizianagaram | Sakshi
Sakshi News home page

Oct 4 2013 11:20 AM | Updated on Mar 22 2024 11:32 AM

రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ విజయనగరం పట్టణంలో విద్యార్థులు శుక్రవారం కదం తొక్కారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిన కళాశాల,లాడ్జీపై విద్యార్థులు రాళ్ల దాడి చేశారు. దాంతో కళాశాల కిటికి అద్దాలు పగిలాయి. అలాగే బొత్సకు చెందిన లాడ్జీలోని ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే విద్యార్థుల రాళ్ల దాడిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దాంతో విద్యార్థులకు గాయాలయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement