ప్రత్యేక హోదా కోసం శాంతియుత ఆందోళనకు దిగిన విద్యార్థులు, యువతను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆంక్షలను బేఖాతరు చేసి, నిషేధాజ్ఞలను ఉల్లంఘించి.. నల్లబ్యాడ్జీలు ధరించి, పోలీసుల కంటపడకుండా సందుల గుండా, గల్లీల గుండా బీచ్‌రోడ్డుకు చేరుకునేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి మౌనపోరాట దీక్షలో పాల్గొనేందుకు ముందుకొస్తున్నారు.