బీహర్ రాజధాని పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఉదయం నుంచి మొత్తం ఆరు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు పాట్నా రైల్వే స్టేషన్ లోని పదవ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఓ టాయిలెట్ సమీపంలో తొలి బాంబు పేలుడు జరుగగా, రెండో బాంబు ఓ సినిమా థియేటర్ వద్ద, మిగితా నాలుగు బాంబులు హుంకర్ ర్యాలీ జరిగే గాంధీ మైదాన్ వద్ద జరిగినట్టు సమాచారం. ఈ ర్యాలీలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఆదివారం పాట్నాలో మధ్నాహం ఒంటి గంటకు 'హుంకర్' ర్యాలీలో నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో బీజేపీతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అలయెన్స్ తెగతెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ సభను నిర్వహించడం ఇదే తొలిసారి. హుంకర్ సభ ద్వారా బీహార్ లో మోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో బాంబు పేలుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ పేలుళ్లకు కారణమైన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Oct 27 2013 2:34 PM | Updated on Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement