కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ను వాయిదావేయాలంటూ నమోదైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఎన్నికల అయిపోయేంత వరకు బడ్జెట్ను వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ జే.ఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూద్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బడ్జెట్ ఓటర్లను ప్రభావితం చేస్తుందని తాము భావించడం లేదని బెంచ్ పేర్కొంది. కేంద్రం ఫిబ్రవరి1న ప్రవేశపెట్టాలనుకున్న 2017-18 బడ్జెట్ను ఏప్రిల్ 1న ప్రవేశపెట్టాలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ అడ్వకేట్ ఎమ్.ఎల్ శర్మ పిల్ను దాఖలు చేశారు.