రూల్ బుక్ చూపించమంటే కేసు పెడతారా? | SC,ST case filed wrongly on Bhuma Nagi Reddy, says Akhila Priya | Sakshi
Sakshi News home page

Jul 4 2015 5:34 PM | Updated on Mar 22 2024 10:59 AM

ఒక మహిళా ఎమ్మెల్యేను పోలింగ్ కేంద్రం నుంచి ఎలా వెళ్లగొడతారు, తాను ఆమె వెంట లేనప్పుడు ఎలా మాట్లాడతారని తన తండ్రి భూమా నాగిరెడ్డి అడిగినందుకే ఆయనపై కేసు పెట్టారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భూమా నాగిరెడ్డి అరెస్టు, దాని పూర్వాపరాలపై ఆమె హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. ఒక మహిళా ఎమ్మెల్యేని ఎలా అవమానిస్తారని నాగిరెడ్డి అడిగారు తప్ప.. అసలు ఆయనపై ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేను లేనప్పుడు ఎందుకు అడిగారు, ఎందుకు కూతురితో మాట్లాడారు, ఒక ఎమ్మెల్యేని ఎలా వెళ్లగొడతారని అడిగారు రూల్ బుక్ చూపించాలని గట్టిగా అడిగారు అంతే తప్ప అన్ పార్లమెంటరీ భాష ఎక్కడా వాడలేదు కానీ సంబంధం లేకపోయినా ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు సండ్ర వెంకట వీరయ్య మీద కేసు ఉన్నప్పుడు చిన్న నొప్పి ఉందని రాజమండ్రి ఆస్పత్రికి పంపారు. ఇప్పుడు నాన్న గుండె రోగి, ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. షుగర్ ఉంది, ఈ ఘటనతో ఆయనకు బీపీ వచ్చింది. అయినా నిమ్స్ కు పంపడానికి బోలెడంత సీన్ క్రియేట్ చేశారు గతంలో కూడా ముందు నంద్యాలకు, అక్కడి నుంచి కర్నూలుకు, తర్వాత నిమ్స్కు పంపారు ఇప్పుడు కలెక్టర్ ముగ్గురు వైద్యుల బృందాన్ని ఆళ్లగడ్డ సబ్ జైలుకు పంపారు. వాళ్లు ఇచ్చే నివేదికను బట్టే నిమ్స్కు పంపుతారట ఆ ముగ్గురిలో కార్డియాలజిస్టులు ఎవరూ లేరు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోంది, సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు భూమా నాగిరెడ్డినే ఇబ్బందిపెడుతున్నాం, మిగిలిన వాళ్లు మాకొక లెక్కా అన్న సందేశాన్ని పంపుదామనుకుంటున్నారు కానీ ఇలా చేస్తే ఆయన ఇంకా రైజ్ అవుతారు తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అది ఈ ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది నాన్న జైల్లో నిరాహార దీక్ష మొదలుపెట్టారు. షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి రేపు ఆయనకేమైనా జరిగితే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అవుతుంది ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు నన్ను అడ్డుకున్నది కూడా పోలీసులే డీఎస్పీ నాతో ఎలా మాట్లాడారో, మేం ఎలా చెప్పామో అన్నీ తెలుస్తాయి మేం అసెంబ్లీలో హక్కుల తీర్మానం పెడతాం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement