తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధపడుతున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళను అక్రమాస్తుల కేసు వెంటాడుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత జయలలితతోపాటు ఆమె నెచ్చెలి అయిన శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు నుంచి త్వరగా బయటపడితే.. సీఎం పదవి చేపట్టేందుకు తనకు లైన్ క్లియర్ అవుతుందని శశికళ భావిస్తున్నారు. కానీ ఇప్పట్లో ఆ అవకాశాలు లేవని తాజా పరిణామాలు చాటుతున్నాయి.