అనుమతివ్వకున్నా నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించి తీరుతామని టీజేఏసీ ప్రకటించడంతో.. పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధమయ్యారు. ఉద్యమానికి సారధ్యం వహిస్తోన్న జేఏసీ చైర్మన్ కోదండరాంను బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయనతోపాటు మరో 50 జేఏసీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.