స్కాంకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని.. స్కాం (scam) అంటే సమాజ్‌వాదీ పార్టీ (s), కాంగ్రెస్ పార్టీ (c), అఖిలేష్ యాదవ్ (a), మాయావతి (m) అని.. మీకు స్కాం కావాలో లేక అభివృద్ది కావాలో నిర్ణయించుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూపీ అభివృద్ది చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు.