60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐర్లాండ్ లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ కు బయలుదేరారు. ఆ దేశ ప్రభుత్వాధినేత (తెషెక్) ఎన్డా కెన్నీతో మోదీ సమావేశమవుతారు.