భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో గజ్వేల్ లోని నెమటూర్ హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయన హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కోమటిబండ చేరుకున్నారు.