తన పర్యటనలో భాగంగా మోడీ ఆదివారం రాత్రి అక్కడి ప్రఖ్యాతి షేక్ జాయేద్ మసీదును సందర్శించారు. భారత్ సహా వివిధ దేశాలనుంచి మార్బుల్స్తో నిర్మించిన మసీదు దగ్గర ఆయన ఎప్పటిలాగానే సెల్పీలతో సందడి చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడమే తన పర్యటన ఉద్దేశమని ప్రధాని మోదీ తెలిపారు. దుబాయ్ తనకు మినీ ఇండియా లాంటిదని అభివర్ణించారు.