తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి బీజేపీ నాయకులను అనుమతించకపోవడంతో వారు నిరసనకు దిగారు. రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణ బిల్లు కోసం ఈ రోజు ప్రత్యేకంగా సమావేశమైన టీ అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై గన్‌పార్క్ వద్ద ధర్నా చేపట్టి అక్కడి నుంచి అసెంబ్లీ వరకు నల్లకండువాలు, నోటికి నల్ల గుడ్డలతో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గత శాసన సభ సమావేశాల్లో బీసీలకు అన్యాయం చేసే ముస్లిం మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే మమ్మల్సి సస్పెండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రాకుండా అడ్డుకొని నియంతృత్వంగా వ్యవహరించారు. సర్కారు వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఒక ముఖ్య చట్టం చేసే సమావేశంలోకి ప్రధాన జాతీయ పార్టీని రాకుండా అడ్డుకోవడం సిగ్గుచేటు' అన్నారు.