‘బంగారుతల్లి’ వారి కి భారమైంది! రెండోసారీ ఆడపిల్లే పు ట్టిందని.. లోకం తెలియని ఆ పసికందును కుటుంబీ కులు చీదరించుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల అనుబంధ గ్రామం బుగ్గతండాలో సోమవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన కాట్రోత్ సరోజ, సుధాకర్ దంపతులు కూలి పనులు చేస్తుంటారు. ఈనెల 8న సరోజ రెండోమారూ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబసభ్యులు సరోజపై కోపం పెంచుకొని పాపను చీదరించుకుంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి పసికందుకు పాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుని, సబ్బునీళ్లు తాగించారు. దీంతో పసికందుకు విరోచనాలయ్యాయి. కన్నపేగును చంపుకోలేక సరోజ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి విషయం వివరించింది. దీంతో ఐసీడీఎస్ అధికారి సుగుణ తండాకు చేరుకొని సరోజ కుటుంబీకులతో మాట్లాడారు. ఫలితం లేకపోవడంతో పాపను హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ఉన్న శిశువిహార్‌కు తీసుకెళ్లారు. పసికందు ఆరోగ్యం బాగానే ఉందని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.