జమ్మూకశ్మీర్‌లో యూరి సైనిక స్థావరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీర మరణం పొందిన సైనికుల సంఖ్య 18కి చేరింది. సిపాయి కె. వికాస్ జనార్థన్.. ఢిల్లీలోని ఆర్ ఆండ్ ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉగ్రదాడిలో మృతి చెందిన సిపాయిల సంఖ్య 20కి చేరిందని వచ్చిన వార్తలను రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రి తోసిపుచ్చారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి కాలిన గాయాలయ్యాయని చెప్పారు.