లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరిన్ని కష్టాలు ప్రారంభమైనట్టే కనిపిస్తోంది. బెంగళూరు రుణ రికవరీ ట్రిబ్యునల్ బెంచ్ తాజా తీర్పుతో మాల్యాకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ చెల్లించాల్సిన రుణాలకు సంబంధించిన రికవరీ ప్రక్రియ ప్రారంభించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు అనుమతిని మంజూరు చూస్తూ గురువారం డీఆర్టీ తీర్పు చెప్పింది. రుణాల రికవరీకి మాల్యా ఆస్తుల ఎటాచ్ మెంట్, చేపట్టాలని ఆదేశించింది. రూ.6,203 కోట్ల రుణాలపై జులై 26, 2013నుంచి 11.5 శాతం వడ్డీని రాబట్టవచ్చని తెలిపింది. అంతేకాదు ఈ తీర్పుపై మాల్యా రుణ రికవరీ పునర్విచారణ న్యాయస్థానాలు (డీఆర్ ఏటీ) వెళ్లాలనుకుంటే.. మొత్తంలో 50 శాతం కోర్టు ఫీజుగా చెల్లించాలని స్పష్టం చేసింది.