అలా పనిచేయలేకే రాజీనామా చేశా: సీఎం | nithish kumar resigns to cm post | Sakshi
Sakshi News home page

Jul 26 2017 7:21 PM | Updated on Mar 22 2024 10:55 AM

బిహార్‌ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆర్జేడీ మేజర్‌ భాగస్వామిగా ఉన్న మహాకూటమిలో పనిచేయలేని పరిస్థితి నెలకొన్నదని, అందుకే తాను రాజీనామా చేశానని నితీశ్‌ అన్నారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలపై తేజస్వి యాదవ్‌ రాజీనామాను తాను కోరలేదని, ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మాత్రమే తాను యాదవులను(లాలూ, తేజస్వి) కోరినట్టు చెప్పారు. అందుకు కూడా వారు ఒప్పుకోలేదని చెప్పారు. ఇలాంటి వాతావరణంలో తాను పనిచేయలేనని అన్నారు. 'నేను ఎవరినీ నిందించడం లేదు. ఎవరైనా నన్ను నిందించాలనుకుంటే అది వారి ఇష్టం' అని చెప్పారు. లాలూతోగానీ, ఆర్జేడీతోగానీ తనకు వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement