ఎక్కడి వెళితే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వొదిగిపోయే నైజం ప్రధానమంత్రి నరేంద్ర మోడీది. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన నిన్న ఫ్లూట్ వాయించి ఆకట్టుకోగా...ఈరోజు డ్రమ్మర్లా మారిపోయారు. జపాన్ పర్యటనలో ఉన్న మోడీ తనలో దాగున్న సంగీత కళలను ఒక్కొక్కటే బయటపెడుతూ ఆశ్యర్యపరుస్తున్నారు. నిన్న పిల్లనగ్రోవి ఊది వీనుల విందు చేసిన మోడీ ఇవాళ డ్రమ్స్ వాయించారు. బీట్ ప్రకారమే డ్రమ్ వాయించి అందర్నీ అబ్బురపరిచారు. మంగళవారం ఉదయం నరేంద్ర మోడీ టోక్యోలో టీసీఎస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్ సంప్రదాయ టైకో డ్రమ్స్ వాయించాలంటూ టీసీఎస్ సీఈఓ చంద్రశేఖర్ మోడీని ఆహ్వానించారు. ఆహ్వానం అందుకున్న మోడీ డ్రమ్ ఎలా వాయిస్తారో దీక్షగా గమనించి... అనంతరం డ్రమ్స్‌పై ఫాస్ట్‌బీట్ వాయించి మెస్మరైజ్ చేశారు.
Sep 2 2014 12:57 PM | Updated on Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement