తమ జాతి ఆకలి తీరుస్తానని చెప్పి, ఓట్లు వేయించుకుని మమ్మల్ని ఎండలో నిలబెట్టారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. కిర్లంపూడిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని గుర్తు చేయడానికి పాదయాత్ర చేయదలిస్తే మమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచుతున్నారన్నారు. మాటి మాటికి మీ వెనుక ఎవరో ఉన్నారని ముఖ్యమంత్రి గారు అంటున్నారు.. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమం నడిపించినప్పుడు నాకు చంద్రబాబు ఎంత ముట్టజెప్పారో చెప్పాలన్నారు. ఈ నెల 14 వ తేదీన శుభవార్త చెబుతారని ఆనందించాను.. కానీ మా జాతి చెవితో అతిపెద్ద కాలీఫ్లవర్ పువ్వులు పెట్టడం జరిగిందని వ్యాఖ్యానించారు.