ప్రజా సమస్యలపై శాసనసభలో మాట్లాడకుండా ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్న టీడీపీ సభ్యులు బుధవారం కూడా మీడియా పాయింట్ వద్ద అదే తీరును అవలంభిస్తున్నారు. నిన్న మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైఎస్‌ఆర్ సీపీ మహిళ సభ్యులను అడ్డుకుని టీడీపీ మహిళ సభ్యులు నానా రభస సృష్టిస్తే....ఇవాళ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వై.విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు ఇతర టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. అధికార పార్టీ సభ్యుల తీరుపై చెవిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.