పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో నగరంతో పాటు తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. గత 24 గంటల్లో రంగారెడ్డి జిల్లా హకీంపేటలో ఏకంగా 17 సెంటీమీటర్ల కుండపోత కురిసింది.