అమృతసర్ కు చెందిన పదమూడేళ్ల బాలుడు సులేమాన్ ఫ్లూట్ తో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్లూట్ భక్తులు సులేమాన్ ట్యూన్ ని ఫాలో అయిపోతున్నారు. 'ఇండియాస్ గాట్ టాలెంట్ 7' షోలో ప్రేక్షకుల ఓటింగ్ తో శనివారం రాత్రి విజేతగా అవతరించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 7 ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, నటుడు కిరణ్ ఖేర్, నటి మలైకా అరోరా ఖాన్ లు ఈ షోకు జడ్జిలు గా వ్యవహరించారు.