ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్ల పండుగ దందాకు తెరలేచింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ముందుగానే సీట్లన్నీ రిజర్వ్ అయ్యాయి. దీంతో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు టికెట్ ధరలను రెండు, మూడు రెట్లు పెంచి అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా హైదారాబాద్ నుంచి విజయవాడ, నగరం నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సుల్లో టికెట్ల ధరలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.