లారీ యజమానుల సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాలయంలో గురువారం ఉదయం మంత్రులు మహేందర్ రెడ్డి, హరీష్ రావు లు లారీ యజమానుల సంఘాలతో చర్చలు జరిపారు. డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు మంత్రులు అంగీకరించారు. వాహన పన్ను, సింగిల్ స్టేట్ పర్మిట్ జారీ అంశాలపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. మూడు వారాల్లోగా సమస్యల పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు సంఘం నేతలు ప్రకటించారు. తెలంగాణ సర్కార్ నిర్ణయం పట్ల లారీ సంఘాల యజమానులు హర్షం వ్యక్తం చేశారు.
Jun 25 2015 12:20 PM | Updated on Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement