అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని తాకేలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో వాహన సేవలు ఊరేగింపు వైభవంగా సాగుతున్నాయి. తొలి రెండు రోజులతో పోల్చుకుంటే ఉత్సవాలకు భక్తజనం పెరిగారు.అనంతరం రాత్రి నిర్వహించిన ముత్యాల పందిరి సేవలో శేషాచలేశుడు మురిసిపోయారు. ముక్తిసాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా శ్రీవారు చాటిచెప్పారు. వాహన సేవల ముందు కోలాటాలు, చెక్క భజనలు, భజన బృందాలు, వివిధ వేషధారణలు, ఉడిపి వాయిద్యం, కేరళ చండీ నృత్యం, మహారాష్ట్ర కళాకారుల డోలు వాయిద్యాల కోలాహలంతో వాహన సేవల్లో సాంస్కృతిక శోభ కనిపించింది. కళాకారుల అభినయం, వేషధారణలు భక్తులు విశేషంగా అలరించాయి.
Oct 6 2016 6:50 AM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement