'రైతులెవరూ అప్పులు చెల్లించొద్దు' | left-parties-ask-farmers-not-to-repay-loans | Sakshi
Sakshi News home page

Dec 11 2014 2:52 PM | Updated on Mar 21 2024 8:18 PM

రైతులు ఎవరూ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి గానీ, ప్రైవేటుగా గానీ తాము తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించొద్దని వామపక్షాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద పది వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతుల ఆత్మహత్యల వ్యవహారంపై ప్రభుత్వం తీరును వామపక్షాలు ఖండించాయి. రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాయకులు మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement