ల్యాండ్ పూలింగ్ చట్ట విరుద్ధం: వైఎస్ఆర్సీపీ | land-pooling-is-illegal-say-ysrcp-leaders | Sakshi
Sakshi News home page

Feb 23 2015 7:10 PM | Updated on Mar 22 2024 11:29 AM

ల్యాండ్ పూలింగ్ చట్ట విరుద్ధమని, భూసేకరణను వెంటనే నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ బృందం డిమాండ్ చేసింది. రాజధాని భూసేకరణ విషయంలో మొత్తం ఏడు అంశాలపై సీఆర్డీఏ కమిషనర్కు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ బృందం ఓ వినతిపత్రం అందించింది. అమాయకంగా ల్యాండ్ పూలింగ్కు అంగీకరించిన రైతులందరికీ వారి పత్రాలను వెనక్కి ఇవ్వాలని నేతలు కోరారు. సీఆర్డీ పరిధి బయట టీడీపీ నేతలు కొన్న వేలాది ఎకరాల భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టుకునే అంశాన్ని పరిశీలించాలని పార్టీ నేతల బృందం కోరింది. రైతులపై అధికారులు, మంత్రులు బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడటంపై కూడా న్యాయ విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. పదో షెడ్యూల్లోని 94వ నిబంధన ప్రకారం ప్రభుత్వ భూముల్లోనే హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. రైతులు, రైతు కూలీలు, భూమిలేని నిరుపేదలు, వృత్తిదారుల హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement