కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి మళ్లీ ఎదురుదెబ్బే తగిలింది. తొలి నుంచీ ఏపీ చెప్పినట్లుగా తలూపుతున్న కృష్ణా బోర్డు మళ్లీ వారి వాదననే సమర్థించింది. పట్టిసీమ నుంచి ఇప్పటివరకు ఏపీ చేసిన వినియోగాన్ని లెక్కలోకి తీసుకోలేమంది. గోదావరి నుంచి కృష్ణాకు తరలించే జలాలపై ఏ విధంగా వ్యవహరించాలన్న అంశాన్ని కృష్ణా వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 గానీ, కేంద్రం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీగానీ తేల్చాలంది. అప్పటివరకూ పట్టిసీమ విని యోగాన్ని పరిగణనలోకి తీసుకోలేమంటూ శుక్రవారం తెలంగాణకు రాసిన లేఖలో పే ర్కొంది. ఇదే జరిగితే ప్రస్తుత లభ్యత జలాల్లో తెలంగాణకు కేటారుుంపులు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది.