ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిపై డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన శనివారం కర్నూలులో మాట్లాడుతూ....‘ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నా. నాలుగేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశా. ఎన్టీఆర్ చాలా ముక్కుసూటి మనిషి. ఇప్పుడున్న మా ఆలోచన ఎక్కువ చేస్తాడు. కర్నూలు అభివృద్ధి కోసం మరోసారి గట్టిగా కోరతాం. పరిశ్రమలు ఎప్పుడొస్తాయని ప్రజలు అడుగుతున్నారు.