‘‘పెట్టుబడులతో రండి.. కలిసి పనిచేద్దాం.. కలిసి అభివృద్ధి చెందుదాం..’’ అని ప్రపంచ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. భారత్ పెట్టుబడులకు స్వర్గధామమని అన్నారు. తెలంగాణలో.. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని కోరారు. అనువైన వాతావరణంతో పాటు పరిశ్రమలకు కావాల్సినంత భూమి హైదరాబాద్‌లో అందుబాటులో ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. సింగిల్ విండో విధానాలు చాలా దేశాల్లో ఉన్నప్పటికీ.. ఆటంకాలు, అడ్డంకుల్లేని అత్యున్నత విధానం ఇదొక్కటేనన్నారు. చైనాలోని డేలియన్ నగరంలో బుధవారం వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన న్యూ ఛాంపియన్స్-2015 సదస్సులో సీఎం పాల్గొన్నారు. ‘ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్‌రోడ్స్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కొత్త రాష్ట్రంలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం, ఇంటింటికీ మంచినీరు, అత్యుత్తమ పారిశ్రామిక విధానం, హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..