తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత జయలలిత కోలుకుంటున్నారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా గురువారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమెను సుబ్బయ్య విశ్వనాథన్ అనే చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. 'గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పర్యవేక్షణలో ఉంచాం. పూర్తిస్థాయిలో కోలుకోగానే డిశ్చార్జి చేస్తాం' అని విశ్వనాథన్ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.