వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాజభవన్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. జగన్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కూడా గవర్నర్ను కలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను వెంటనే సమావేశపరచాలని జగన్ ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. కాగా రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర కేబినెట్ నోట్‌కు ఆమోదముద్ర పడకముందే రాష్ట్ర అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్యం కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇదివరకు గవర్నర్‌కు ఒక వినతిపత్రం అందజేయడం తెలిసిందే. అయితే తెలంగాణ అంశంపై అసెంబ్లీ తీర్మానం కోరడం లేదన్న విషయం రూఢి అయిపోయి కేవలం అభిప్రాయానికి మాత్రమే బిల్లును పంపుతారని తేలిపోయిన నేపథ్యంలో మరోసారి జగన్ ....గవర్నర్తో భేటీ అయ్యారు.
Oct 17 2013 1:14 PM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement