తమిళనాడు రాజధాని చెన్నైలో తెలుగు వ్యాపారవేత్తల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు సంచలనం రేపాయి. ముగ్గురు తెలుగు వ్యాపారవేత్తలు శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి ఇళ్లలో 60 మంది ఐటీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. వేలూరు, కాట్పాడిలోని నివాసాల్లో సోదాలు చేశారు. 100 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.