చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభకు చెందిన కంపెనీలు, ఇళ్లలో జరుగుతున్న ఐటీ సోదాలు శనివారం సాయంత్రం ముగిసాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యే కంపెనీలు, మెడికల్ కాలేజీల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించడం జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆదాయపు పన్ను శాఖ ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిపే సాధారణ తనిఖీలే అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓటుకు నోటు కేసులో సత్యప్రభ తనయుడు డీఏ శ్రీనివాస్‌ను విచారించిన తర్వాతే ఈ దాడులు జరిగాయని టీడీపీలోని ఓ వర్గం అంటోంది. ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆస్తులు చాలా భాగం సత్యప్రభ కుటుంబం పేరుతో ఉన్నాయని అందుకే దాడులు జరిగాయని వాదన కూడా జిల్లాలో వినిపిస్తోంది
Sep 25 2016 9:12 AM | Updated on Mar 20 2024 3:39 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement