జోరుగా.. హుషారుగా సాగిన మ్యూజిక్ కన్సర్ట్.. యువతీయువకుల కేరింతలు, తుళ్లింతలతో హంగామా.. పాప్ స్టార్ అరియానా గ్రాండేతో కలసి చిందులేసిన చిన్నారులు.. మ్యూజిక్ కన్సర్ట్ మరికాసేపట్లో ముగుస్తుందనగా అలజడి.. ఒక్కసారిగా భారీ తీవ్రతతో పేలుడు.. రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాలు.. తీవ్ర గాయాలతో నెత్తురోడిన క్షతగాత్రులు.. ప్రాణ భయంతో జనం పరుగులు..