గోల్కొండ వేదికగా 69వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి వేడుకలను కూడా గోల్కొండలోనే జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. గోల్కొండ వేదికగా గ్రామజ్యోతి పథకాన్ని ప్రకటించారు. ఉదయం 9.20 గంటలకు సికింద్రాబాద్లో అమరవీరుల, సైనిక స్మారక స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం 9.50 గంటలకు గోల్కొండ చేరుకున్నారు. అక్కడ రాణీమహల్ వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.