గ్యాంగ్స్టర్ నయీం కేసు దర్యాప్తుకు నియమించిన సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) రంగంలోకి దిగింది. సిట్ ప్రత్యేక అధికారి నాగిరెడ్డి బుధవారం సాయంత్రం నార్సింగిలోని నయీం ఇంట్లో స్వయంగా సోదాలు చేపట్టారు. నయీం బెడ్ రూమ్, పర్సనల్ రూమ్ లో డి తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే రాజేంద్రనగర్ మండలం నెక్‌నాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్కపురి టౌన్‌షిప్‌లో నయిం ఇంట్లో 60కి పైగా ఖరీదైన వాచీలు, డైమండ్ రింగ్స్, ఏకే-47 గన్ ఉన్నట్లు సమాచారం.