దివంగత నందమూరి తారక రామారావుకు 'భారతరత్న' పురస్కారం ఇచ్చేవరకు పోరాడతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ శివారు గండిపేటలో జరుగుతున్న మహానాడు రెండో రోజున ఆయన మాట్లాడారు. పేదలకు అనేక పథకాలు చేపట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ పేరు మీద చీర - ధోవతి పథకాన్ని ప్రవేశపెడతానని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు