పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరం లేని విషయాలు ప్రస్తావనకు తెచ్చారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్హతల విషయాన్ని సీఎం తన చర్చలోకి లాక్కొచ్చారు. అయితే సీఎం వ్యాఖ్యలకు వైఎస్ జగన్ దీటుగా సమాధానం ఇవ్వడమే కాకుండా, చురకలు అంటించారు.