తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్వహిస్తోన్న శాఖలను ఆర్థిక మంత్రి ఓ. పన్నీర్ సెల్వంకు అప్పగించడంపై డీఎంకే చీఫ్ కరుణానిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెల్వంకు కొత్త బాధ్యతలు కట్టబెడుతూ మంగళవారం రాత్రి రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనలోని అంశాలపై విస్మయం వ్యక్తం చేశారు.