ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో హైకోర్టు మంగళవారం తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై తెలంగాణ ఏసీబీ సరిగా దర్యాప్తు చేయడం లేదంటూ వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ప్రత్యేక న్యాయస్థానం దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.