యాదాద్రి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ అదృశ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రేమించి పెండ్లి చేసుకున్న తన కుమారుడు కనిపించడం లేదని, అతని ఆచూకీ కనిపెట్టాలంటూ నరేష్ తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేయగా, దానిపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది.