పూర్ణిమ సాయి కథ సుఖాంతం | Happy ending To missing girl poornima sai case | Sakshi
Sakshi News home page

Jul 19 2017 4:33 PM | Updated on Mar 21 2024 8:49 PM

పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లేందుకు ఆమె అంగీకరించింది. సైకాలజిస్టుల కౌన్సెలింగ్‌తో పూర్ణిమ సాయి మనసు మార్చుకుంది. ముంబై స్టేట్‌హోంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు వద్దకు వెళ్లనని, వాళ్ల ముఖాలే చూడనని తెగేసి చెప్పిన పూర్ణిమ... హైదరాబాద్‌కు రాగానే సానుకూలంగా స్పందించింది. గత నెల 7న అదృశ్యమై ముంబై చేరిన పూర్ణిమ సాయిని పోలీసులు ఇవాళ ఉదయం హైదరాబాద్‌ నింబోలి అడ్డాలోని బాలికాసదన్‌లో చేర్చారు. సుదీర్ఘ ప్రయాణం చేయటంతో అలసిపోయిన పూర్ణిమ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. అయితే పూర్ణిమ ఆరోగ్యం కుదుటపడ్డాకా... చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మరోసారి సమావేశమై పూర్ణిమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement